కుంగిన బేస్‌మెంట్.. ప్రభుత్వ విప్‌కు తప్పిన ప్రమాదం

X
వేములవాడ: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి ఆయన వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్, పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్‌మెంట్‌పై నిల్చొని ఆయన పరిశీలిస్తున్నారు. ఎక్కువ మంది నిలుచోవడంతో బేస్‌మెంట్ ఒక్కసారిగా కుంగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను పట్టుకొవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Next Story
-
Home
-
Menu
