రాజన్న ఆలయంలో దర్శనాలు బంద్

X
మన తెలంగాణ/వేములవాడ: దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం వేకువజాము నుండి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. ఆలయం చుట్టు పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్‌ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడె మొక్కులు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించారు. అభివృద్ది పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుండి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇవాళ తెల్లవారుజామున మెయిన్ గేట్‌ను ఇనుప రేకులతో మూసివేశారు.
Next Story
-
Home
-
Menu
