ప్రసాదంలో మత్తుమందు కలిపి... మహిళలపై నకిలీ బాబా అత్యాచారం... వీడియోలు అమ్ముకొని

ప్రసాదంలో మత్తుమందు కలిపి... మహిళలపై నకిలీ బాబా అత్యాచారం... వీడియోలు అమ్ముకొని
X


చెన్నై: పూజలు, మంత్రాల పేరుతో మహిళలకు ప్రసాదంలో మత్తుమందు పెట్టి అనంతరం వారిపై అత్యాచారం నకిలీ బాబా అత్యాచారాలు చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా వాళపాడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయరాజు(50) అనే నకిలీ బాబా మంత్రాలు, పూజాల పేరుతో ప్రజలను నమ్మిస్తూ మోసం చేసేవాడు. ఎవరికైనా అనారోగ్య సమస్యలతో పాటు శనీశ్వరుడిని నుంచి విముక్తి కల్పిస్తానని పూజలు చేసేవాడు. తన దగ్గర వచ్చిన మహిళలకు ప్రసాదంలో మత్తు మందు పెట్టేవాడు. అనంతరం వారిపై అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీసేవాడు. వినాయక చవితి చందాల పేరుతో పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా 50కి పైగా అశ్లీల వీడియోలు కనిపించడంతో ఒక్కసారిగా పోలీసులు కంగుతిన్నారు. అశ్లీల వీడియోలను అతడు డార్క్ వెబ్ ఫోర్టల్స్‌కు విక్రయించినట్లు నకిలీ బాబా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story