తల్లిదండ్రులు, సోదరిని చంపి... ఇంట్లోనే పాతి పెట్టిన కుమారుడు

తల్లిదండ్రులు, సోదరిని చంపి... ఇంట్లోనే పాతి పెట్టిన కుమారుడు
X

బెంగళూరు: కుమారుడు కన్నతల్లిదండ్రులు, చెల్లిని చంపి అనంతరం వారి మృతదేహాలను ఇంట్లోనే పాతి పెట్టారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయనగర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిత్రదుర్గ జిల్లాకు చెందిన భీమరాజ్, జయలక్ష్మీ అనే దంపతులు కొట్టూరులో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె అమృత ఉంది. అమృత యువకుడితో ప్రేమలో పడి గర్బం దాల్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెతో గొడవ పడ్డారు. అమృతను అబార్షన్ చేయించాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అబార్షన్ కోసం తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తల్లి, సోదరి హత్య చేశాడు.

అనంతరం తండ్రిని చంపి ఇంట్లో గుంత తీసి మూడు మృతదేహాలను పాతిపెట్టాడు. తండ్రి కాళ్లు పొడవుగా ఉండడంతో రెండు కాళ్లు నరికి పక్కన పెట్టాడు. అనంతరం టైల్స్ వేసి బెంగళూరుకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, సోదరి కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ దర్యాప్తు అనుమానాలు రావడం అక్షయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరువు కోసం హత్య చేశాడా? లేక డబ్బు కోసమే తల్లిదండ్రులను చంపాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం భీమ్ రాజ్ పొలం విక్రయించగా వచ్చిన డబ్బును తనకు ఇవ్వాలని అక్షయ్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగుతున్నాడు.

Tags

Next Story