ప్రేమపెళ్లికి అడ్డు... తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి...

వికారాబాద్: ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్న తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపిన సంఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాచారంలో గ్రామంలో సురేఖ అనే యువతి తన తల్లిదండ్రులు, సోదరుడికి కలిసి నివసిస్తోంది.సురేఖ ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆస్పత్రిలో ఓ యువకుడు పరిచయం కావడంతో ప్రేమలో పడ్డారు. యువకుడి ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. తల్లిదండ్రులను చంపేసి ప్రేమపెళ్లి చేసుకోవచ్చని నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులకు ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పడంతో ఇద్దరికి కెటమైన్ అనే మత్తు ఇంజక్షన్ అధిక మోతాదులో ఇచ్చింది. తెల్లవారుజామున ఇద్దరు నిద్ర నుంచి లేవకపోవడంతో అమ్మనాన్న సహజంగా చనిపోయారని అందరినీ నమ్మించింది. ఆమె సోదరిడికి అనుమానం రావడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో మత్తు ఇంజక్షన్‌తో చనిపోయినట్టు తేలడంతో సురేఖను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
-
Home
-
Menu
