ఎసిబికి చిక్కిన గ్రామ పరిపాలనాధికారి

X
సాదాబైనామా పట్టా చేయడానికి గ్రామ పరిపాలనాధికారి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు చిక్కాడు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ ఫకీర్‌కు సంబంధించిన సాదాబైనామా పట్టా మార్పిడి చేయించేందుకు జిపివొ దుర్గాప్రసాద్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం కార్యాలయం బయట మహమ్మద్ ఫకీర్ నుంచి రూ. 80,000 లంచం తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పీ మధు ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిపివొ నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Next Story
-
Home
-
Menu
