విండీస్‌తో తొలి వన్డే.. సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా?

Virat Kohli
X

వెస్టిండీస్ జట్టుతో ఆదివారం నుంచి టీం ఇండియా వన్డే సిరీస్‌లో తలపడనుంది. తొలి వన్డే తిరువనంతపురం వేదికగా జరగనుంది. ఇప్పటికే అక్కడకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే ఈ తొలి మ్యాచ్‌లో టీం ఇండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఓ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. అది ప్రస్తుతం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.

తిరువనంతపురంలో జరిగే వన్డేలో కోహ్లీ మరో 59 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. విరాట్ ఇప్పటివరకూ 311 ఇన్నింగ్స్‌లో 14,941 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 377 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి చేరుకున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 105 పరుగులు చేస్తే.. వన్డేల్లో 12,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. మరి విరాట్-రోహిత్ ఈ రికార్డులు సాధిస్తారో లేదో చూడాలి.

Tags

Next Story