లండన్ కు బయలు దేరిన విరాట్ కోహ్లీ

Virat Kohli went to London
X

Virat Kohli went to London

ముంబయి: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ పూర్తి కావడంతో టీమ్‌ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్ బయలుదేరారు. ముంబై ఎయిర్‌పోర్టులో విరాట్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా కోహ్లి తన కుటుంబంతో కలిసి లండన్ ఉంటున్న విషయం తెలిసిందే. . ఈ నెలాఖరున బెంగళూరులో జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడేందుకు ఆయన తిరిగి భారత్‌కు రానున్నారు. వచ్చే ఏడాది జనవరిలో భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో కూడా కోహ్లి ఆడనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ లలో రెండు సెంచరీలు చేయడంతో ఒక భారీ హాఫ్ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో టాస్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో విరాట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.


Tags

Next Story