వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..లాంచ్ డేట్ ఇదే..!

వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..లాంచ్ డేట్ ఇదే..!
X

భారత టెక్ మార్కెట్లో వివో నుంచి సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ దీని వివో టి5 లైట్ 5జి పేరిట తీసుకురానుంది. అయితే సంస్థ, ఈ ఫోన్ విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించింది. వచ్చే వారం జూలై 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎంట్రీ ఇవ్వనుంది. టి సిరీస్‌లో వస్తోన్న ఈ కొత్త ఫోన్ విడుదల తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక మైక్రోసైట్ ప్రకారం, ఇది రెండు రంగుల ఎంపికలలో విడుదల కానుంది.

వివో టి5 లైట్ 5జి అంచనా ఫీచర్లు విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో విడుదల అవుతుంది. వేగం, మల్టీటాస్కింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించవచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో విడుదల అవుతుందని సమాచారం. ఈ తాజా వివో ఫోన్ కంపెనీ ఒరిజిన్ఓఎస్ 6 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. అదనంగా, ఈ పరికరంలో ఏఐ క్యాప్షన్, ఏఐ క్రియేషన్, ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఏఐ డాక్యుమెంట్స్, ప్రైవేట్ స్పేస్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కూడా వెల్లడైంది. వివో నుండి రాబోతున్న ఈ కొత్త 5G ఫోన్ నీరు- ధూళి నిరోధకత కోసం IP65 రేటింగ్ ఉండవచ్చు.

Tags

Next Story