వివో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్

వివో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్
X

వివో తన కొత్త బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్ Vivo Y05eను అధికారికంగా దక్షిణాఫ్రికా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇటీవల గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించిన ఈ ఫోన్ ఇప్పుడు పూర్తి వివరాలతో అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో పెద్ద డిస్‌ప్లే, 5150mAh బ్యాటరీ, 8GB వరకు ర్యామ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఎంట్రీ లెవల్ వినియోగదారులను ఆకట్టుకునేలా కంపెనీ దీనిని రూపొందించింది.



ధరెంత

వివో Y05e ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ వోడాకామ్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదలైంది. దీని ధర 2,499 సౌత్ ఆఫ్రికన్ రాండ్‌లు, భారత కరెన్సీలో సుమారు రూ.14,500గా ఉంటుంది. ప్రస్తుతం గ్రీన్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.



ఫీచర్లు

వివో Y05eలో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. పనితీరు కోసం యూనిసోక్ T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందించారు. 4GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ర్యామ్‌ను జోడించి మొత్తం 8GB వరకు ర్యామ్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో 5150mAh బ్యాటరీ ఉంది. బ్యాటరీ ఆరోగ్యం నాలుగు సంవత్సరాల వరకు మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా పొందిన ఈ ఫోన్, సాధారణంగా చేతి నుంచి జారిపడినప్పుడు కూడా మెరుగైన రక్షణను అందించేలా రూపొందించబడింది. కనెక్టివిటీ కోసం వై-ఫై, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్‌తో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా అందించారు. ఫోన్‌కు IP64 రేటింగ్ ఇవ్వడంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది. దీని బరువు 199 గ్రాములు.

Tags

Next Story