రెచ్చిపోయిన దొంగలు.. ఎంత బంగారం ఎత్తుకెళ్లారంటే..

విజయనగరం: జిల్లాలోని రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లలో దాదాపు కేజీన్నర బంగారం చోరీ చేశారు. స్థానిక జిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్స్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం అర్థరాత్రి ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ నగేశ్ ఇంట్లో దుండగులు 1,250 గ్రాముల బంగారం, కిలో వెండి దోచుకెళ్లారు. అయితే వైద్యుడి కుటుంబం విశాఖలో ఉంటోంది. శనివారం విధులు ముగించుకొని నగేశ్ కూడా విశాఖకి వెళ్లిపోయారు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం తొలగించి ఉంది. బీరువాలోని వెండి, బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫఇర్యాదు చేయగా.. పోలీసులు క్లూస్ టీమ్‌తో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
దీనికి సమీపంలోని మరో నివాస సముదాయంలోనూ చో ఘటన కలకలం రేపింది. జిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కృష్ణారెడ్డి ఇంట్లో 20 తులాల బంగారు నగలు చోరీ చేశారు.
-
Home
-
Menu
