భారతీయుల గొంతుక వందేమాతరం: ప్రధాని మోడీ

voice of Indians is Vande Mataram
ఢిల్లీ: స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక వందేమాతరం అయిందని ప్రధాని మోడీ తెలిపారు. వందేమాతరం గేయం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని ప్రశంసించారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు అయిన సందర్భంగా లోక్ సభలో చర్చను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకుందని, చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందని, ఈ మధ్యే మనం రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకుందని గుర్తు చేశారు. 150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందని కొనియాడారు. వందేమాతర గీతానికి.. దాని గౌరవాన్ని తిరిగి తెచ్చి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింద వందేమాతరాన్ని తొక్కిపెట్టారని, వందేమాతరం చర్చ విషయంలో ఇక్కడ స్వపక్షం.. విపక్షం అంటూ ఎవరూ లేరని తెలియజేశారు. స్వాతంత్య్ర సంగ్రామం ఫలితంగానే మనందరం ఇక్కడ ఉన్నామని, దేశం మొత్తం వందేమాతర గీతం స్ఫూర్తితో ఏకమైందని గుర్తు చేశారు.
-
Home
-
Menu
