ఘోర రోడ్డు ప్రమాదం.. 9 నెలల గర్భణీ డాక్టర్ మృతి

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అవతలి వాహనం నడిపే వ్యక్తి అజాగ్రత్తగా ఉంటే ప్రమాదానికి గురి కాక తప్పదు. సరిగ్గా ఇలాంటి దుర్ఘటనే వరంగల్‌లో చోటు చేసుకుంది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్.మమతారావు హంటర్‌రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు.
సోమవారం రాత్రి విధులు ముగించుకొని భర్తతో కలిసి హంటర్ రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యంలో ఏడు మోరీల కూడలి వద్ద వెనుక నుంచి టిప్పర్ బైకును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ కింద పడి పోయారు. వెంటనే స్థానికులు స్పందించి భార్య భర్తలను ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయాలు కావడంతో మమతా చికిత్స పొందుతూ మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ అన్సారీ ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై దర్యప్తు చేపట్టారు.
-
Home
-
Menu
