మామునూరు డొమెస్టికేనా?

మామునూరు డొమెస్టికేనా?
X

మనతెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మామునూర్ ఎయిర్ పోర్టుకు రాజకీయ గ్రహ ణం పట్టిందా? శంషాబాద్‌కు నష్టం కలగకుం డా ఉండేందుకు వీలుగా మామునూర్ ను డిజైన్ చేస్తున్నారా? అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అం టూ ఊదరగొట్టి ఒక్క టెర్మినల్‌తో డొమెస్టిక్ వి మానాశ్రయంగా ఏర్పరిచి స్థాయిని తగ్గించేందు కు చేసిన ప్రయత్నాలు ఫలించాయా? అంటే అ వుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో నెరపిన రాజకీయ మంత్రాంగం ఫలిం చి అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకోవాల్సిన మామునూర్ ఎయిర్ పోర్టు కాస్తా చిన్న ఎయిర్ పోర్ట్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఉ న్న ఏకైక ఎయిర్ పోర్టు హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. తెలంగాణలో రెండవ పెద్ద నగరమైన ఓరుగల్లులో ఏర్పాటుచేసే విమానాశ్రయం కూడా అంతర్జాతీయ ప్ర మాణాలతో ఉంటుందని పాలకులు ప్రకటించా రు. దానికి అనుగుణంగా భూసేకరణను ప్రభు త్వం చేపట్టింది. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అవసరాల మేరకు రన్ వే 2.9కిలోమీటర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. తీరా చూస్తే... రన్ వేను కాస్తా 2500 మీటర్లకే పరిమితం చేశా రు.

ఈ పరిణామాలతో అంతర్జాతీయ ఎయిర్ పో ర్టు వస్తుందనే ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. డిసెంబర్ లోనే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తామని కేంద్ర పౌర, విమానాయన శాఖ మం త్రి రామ్మోహన్ నాయుడు స్వయాన ప్రకటించినా కార్యరూపం దాల్చేలా లేదు. పర్యావరణ అనుమతుల్లో జాప్యం కారణంగా మరో నాలుగు నెలల పాటు పనులు చేపట్టే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వరంగల్ కు ఉన్న రాజకీయ, పారిశ్రామిక, పర్యాటక ప్రాధాన్యతల దృష్ట్యా ప్రజల్లో బలమైన కాంక్ష ఉన్నది. స్వాతంత్య్రానికి ముందే మామునూరులో ఎయిర్ పోర్టు ఉన్నది. అప్పట్లోనే డొమెస్టిక్ సర్వీసులు కొనసాగాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఐటీ, పారిశ్రామిక విస్తరణ మూలంగా అన్ని హంగులు కల్పిస్తారని భావించినప్పటికీ స్థాయిని తగ్గించడం విమర్శలకు గురవుతున్నది. ప్రస్తుతం మామునూరు ఎయిర్ పోర్టులో ఒక టెర్మినల్ మాత్రమే ఏర్పాటుచేయనున్నారు. దీనిని 6800 చదరపు స్క్వేర్ మీటర్ల వైశాల్యంలో నిర్మించేలా డిజైన్ చేశారు. కేవలం 850 మంది ప్రయాణీకులకు వీ లుగా రూపొందించనున్నారు. మూడు ఏఫ్రాన్లు అంటే మూడు

విమానాలకు ఎయిరో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అలాగే 2500 మీటర్లతో రన్ వే ను ఏ- 320 విమానాలు( కోడ్ - సీ) దిగేలా ప్లాన్ చేశారు. ఒక ఏటిసి భవనంతో పాటుగా ఫైర్ స్టేషన్ ను నిర్మించనున్నారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టును దృష్టిలో పెట్టుకుని రన్ వే ను 2.9 కిలోమీటర్లకు బదులుగా 2500 మీటర్లకే పరిమితం చేస్తూ టెండర్లు పిలిచారు. కార్గోలు దిగేందుకు అనుగుణంగా ముందు ప్లాన్ డిజైన్ చేస్తే దానికి భిన్నంగా చిన్న పోర్ట్ తో సరిపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మామునూరు ఎయిర్ పోర్టులో కార్గోలు దిగినట్లయితే శంషాబాద్ కు ఆదాయం తగ్గుతుందనే కారణంతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి చిన్నదిగా చేసినట్లు ప్రచారం సాగుతున్నది. కేవలం డొమెస్టిక్ కు పరిమితం అయ్యేలా చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే మామునూరు ఎయిర్ పోర్టును అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా తీర్చిదిద్దాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తిమ్మాపూర్ క్రాస్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్

మామునూరు ఎయిర్ పోర్టు ప్రారంభమైతే ఎంట్రీ, ఎగ్జిట్ ఎటు ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారిలో పోలీస్ క్యాంపు సమీపంలోని తిమ్మాపూర్ క్రాస్ దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్ నిర్మాణం ఉంటుందని ఏఏఐ విడుదల చేసిన నమూనాలో పేర్కొన్నది. రన్ వే ముగింపు మాత్రం నక్కపల్లి వైపు ఉంటుందని తెలిపింది.

Tags

Next Story