చిన్నారిపై వీధి కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు..

X
వరంగల్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. 35వ డివిజన్‌లోని నాలుగు జెండాల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న చిన్నారిపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కుక్కలను తరిమి కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నారిపై కుక్కలు దాడి చేస్తున్న సమయంలో స్థానికులు చూసి గట్టిగా కేకలు వేయడంతో కుక్కలు పారిపోయాయి. ప్రస్తుతం గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Next Story
-
Home
-
Menu
