ప్రపంచకప్‌కి ముందు వార్మప్ మ్యాచ్‌లు.. భారత్ పోరు ఎవరితో అంటే..

ఐసిసి టి-20 ప్రపంచకప్ త్వరలో ప్రారంభంకానుంది. అయితే ఈ మెగా టోర్నీ కంటే ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు ఉంటాయని ఐసిసి తెలిపింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీం ఇండియా ఫిబ్రవరి 4న సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇండియా ఎ జట్టు ఈ రోజు (ఫిబ్రవరి 2న) యుఎస్ఎతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం ఐదు గంటకు ప్రారంభం అవుతుంది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ.. ఇండియా ఎ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌లు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈనెల 6న ఇండియా ఎ vs నమీబియా మ్యాచ్ బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతుంది.
అఫ్గానిస్థాన్ vs స్కాట్‌లాండ్, యుఎస్ఎ vs ఇండియా ఎ, కెనడా vs ఇటలీ, నేపాల్ vs యుఎఇ, అఫ్గానిస్థాన్ vs వెస్టిండీస్, పాకిస్థాన్ vs ఐర్లాండ్, నేపాల్ vs కెనడా, న్యూజిలాండ్ vs యుఎఇ, ఇటలీ vs యుఎఇ, నమీబియా vs ఇండియా ఎ. మ్యాచు్లు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
వార్మప్ మ్యాచ్‌లకు ఇండియా ఎ జట్టు: ఆయయు బదోని (కెప్టెన్), నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, నారాయణణ్ జగదీశన్ (కీపర్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మానవ్ సుతార్, ఆశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (కీపర్), గుర్జప్‌నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి భిష్ణోయ్, ఖలీల అహ్మద్, మయాంక్ యదవ్.
-
Home
-
Menu
