వాచ్ మన్ దంపతుల హత్య

వాచ్ మన్ దంపతుల హత్య
X

అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్ మన్ దంపతులను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భార్యాభర్తల హత్య అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు చెప్పారు. కాగా మృతులు మహబూబబాద్ జిల్లా, గూడూరు మండలం, దొంగచింత తాండకు చెందిన ధరావత్ సోముల(45), ధరావత్ మంగమ్మ (40) గా పోలీసులు గుర్తించారు. మృతుడు గత మూడున్నర సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి అని బిల్డర్ దగ్గర పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు.

అతనికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు పెళ్లికాగా, చిన్న కూతురు సానియా పదవ తరగతి పరీక్ష రాస్తోంది.భార్యాభర్తలు హత్యకు గురి అవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్యూస్ టీం, డాగ్ స్క్వాడ్ ల సహాయంతో కీలక ఆధారాలను సేకరించారు. జంట హత్యలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రామచంద్రాపురం ఏసిపి శ్రీనివాస్ కుమార్ చెప్పారు.

Tags

Next Story