అంతు పట్టని వింత..పసుపు కలర్ లో నీటి బిందువులు

అంతు పట్టని వింత..పసుపు కలర్ లో నీటి బిందువులు
X

కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, ఎర్రపహడ్ గ్రామంలో గత 20 రోజుల నుండి గౌండ్లవాడగల్లి దేవాలయం పక్కన, పరిసర ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో పసుపు కలర్ లో నీటి బిందువులుగా పడుతుండడంతో స్థానికులు ఎమిటి వింత అని ఆశ్చర్యపోతున్నారు. ఎల్లో కలర్ డాట్స్ కిందకు పడిన వెంటనే ఎండిపోయి, పౌడర్‌గా మారుతోందని, ఎందుకు ఇలా జరుగుతుందని అధికారులను పలువురు ప్రశ్నించడంతో..వీటి వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదని చెబుతున్నారు. అయితే, ఒకే ప్రదేశంలో తుంపర వర్షం మాదిరిగా, వ్యర్థ పదార్థంగా ప్రతిరోజూ పడుతుండడంతో భయందోళనతో జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానికులు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న ఈ ఎల్లో కలర్ డాట్స్‌ను ఎంపిడిఒ సయ్యద్ సాజిద్ అలీ, వ్యవసాయ అధికారి నర్సింలు పరిశీలించారు. వాటిని ల్యాబ్‌కు పంపించి, అనంతరం ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు.

Tags

Next Story