ఎపిలో మారనున్న వాతావరణం.. మూడు రోజులు వానలే!

ఎపిలో మారనున్న వాతావరణం.. మూడు రోజులు వానలే!
X

మన తెలంగాణ – అమరావతి: బంగాళాఖాతంలో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొమొరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు అంతర్గత తమిళనాడు మీదుగా తూర్పు గాలుల ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాయలసీమలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు, రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Tags

Next Story