వార ఫలాలు (30-11-2025 నుండి 06-12-2025 వరకు)

Rasi Phalalu
X

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కొన్ని చిక్కులు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి. వారాంతంలో కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపార పరంగా కూడా ద్వితీయార్థంలో మంచి లాభాలు పొందుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది. ఏమైనా విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మీపై నిందలు ప్రచారంలో ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం చదవండి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. నూతన కార్యక్రమాలకు ప్రారంభంలో ఉన్నటువంటి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. వారాంతంలో వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 2 కలిసివచ్చే రంగు డార్క్ బ్లూ. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి.

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ప్రస్తుతం మౌడ్యమి నడుస్తుంది కాబట్టి మౌడ్యమి పూర్తయిన తర్వాత వివాహపరంగా ముందుకెళ్లడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. వాహనయోగం ఉంది. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఈఎన్టి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు కాషాయం.

మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తారు. వచ్చినా అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో విఫలం అవుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మెడిటేషన్ చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగా రావలసినటువంటి లీజులు లైసెన్సులు చేతికి అందుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బుధవారం రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. గణపతి స్వామివారిని ఎక్కువగా ఆరాధించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. స్థిరాస్తుల పంపకాల విషయంలో నమ్మకద్రోహానికి గురవుతారు జాగ్రత్త వహించండి. మన అనుకున్న వాళ్లే మనల్ని మోసం చేయడం జరుగుతుంది. పెరియర్ పరంగా కలిసి వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. సినీ కళా రంగాల వారికి బాగుందని చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. శుభకార్యాలు చేయగలుగుతారు. వాహన యోగం గృహ యోగం ఉంది. నాగ సింధూరం ప్రతిరోజు నుదుటన ధరించండి. నర దిష్టి తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్.

సింహ రాశి వారికి వివాహం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నప్పటికీ అనుకూలంగానే ఉంటుంది. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగానే ఉంటుంది. హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కెరియర్ పరంగా బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు మంజూరు అవుతాయి. నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. వ్యాపార పరంగా నూతన బ్రాంచీలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు బ్లూ.

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. మనోవేదన ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. చేపట్టిన పనులలో ఏర్పడిన అడ్డంకులను అధిగమిస్తారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శ్రద్ధ వహించాలి. గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు బ్లూ.

వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. జేష్ఠ సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గణపతి స్వామి వారికి గాకారక అష్టోత్తరంతో పూజ చేయండి. సహోద్యోగులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలుగుతాయి. ఇంకా బయట అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్.

ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబపరంగా సహాయ సహకారాలు అందుతాయి. దైవదర్శనాలు విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించకపోవచ్చు. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి బాగుంది. జీవితం భాగస్వామి సహకారంతో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నూతన కోర్సులను అభ్యసిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఓం నమో నారాయణా వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్.

కుంభ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఎంతోకాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించండి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రే.

మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దైవారాధన ఎక్కువగా చేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయ రంగంలో రాణిస్తారు. గణపతి స్వామి వారిని గరికతో గకారక అష్టోత్తరంతో పూజించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. అధికారుల అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నది. వ్యాపారాలలో సొంత నిర్ణయాల వలన లాభాలు ఎక్కువగా అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. శని గ్రహం దగ్గర నల్ల వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు ఎల్లో.





Tags

Next Story