వార ఫలాలు (13-09-2026 నుంచి 19-09-2026 వరకు)

వార ఫలాలు (13-09-2026 నుంచి 19-09-2026 వరకు)
X

మేషం

మేష రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. దూర ప్రాంతా ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేయండి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభం

వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరుస్తాయి వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం బాగుంటుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకుగా కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గణపతి స్వామి వారికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేసి ప్రారంభించండి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ధనాదాయం బాగుంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఈ గణపతి నవరాత్రులలో జిల్లేడు భక్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధునం

మిధున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కుటుంబపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మిగతా భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఏదైనా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గణపతి స్వామి వారికి పూజ చేసి ప్రారంభించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మధ్యస్థ ఫలితాలే గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పడకూడదు. ప్రభుత్వపరంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కాంట్రాక్టులు లీజులు టెండర్లు లభిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ గణపతి నవరాత్రులలో వినాయకుడికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఇదేనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు గ్రీన్ కార్డ్ సంబంధిత వ్యవహారాలు హెచ్ వన్ బి వీసా వంటివి అనుకూలిస్తాయి. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీకు మీరుగా సొంతంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. సంతాన సంబంధిత విష వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజూ కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే గరికతో గకారక అష్టోత్తరంతో గణపతి స్వామి వారికి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

సింహం

సింహ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అధిక కోపాన్ని కలిగి ఉంటారు జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా శని గ్రహ స్తోత్రం చదవండి. అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. భాగస్వామితో శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. విదేశీయానం చేస్తారు. మీ మౌనంతో చాలా సమస్యలను పరిష్కరిస్తారు. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కన్య

కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఒక శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. భూ సంబంధిత విష వ్యవహారాలు కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు సమసి పోతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆలయ మార్గాలు బాగుంటాయి ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు తప్పవు. మీ వాక్చాతుర్యంతో నలుగురిని మెప్పించ గలుగుతారు. ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తులారాశి

తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ యానం చేస్తారు. సంతానం యొక్క విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పక పోవచ్చు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. సినీ కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. అలాగే గకారక అష్టోత్తరంతో గరికతో గణపతి స్వామి వారికి ప్రతిరోజు పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు బ్లూ.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. చేయని తప్పుకు నింద పడవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రతి చిన్న విషయానికి మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది కానీ మనశ్శాంతి లోపిస్తుంది. ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు గకారక అష్టోత్తరంతో గరికతో గణపతి స్వామి వారికి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

ధనస్సు

ధనస్సు రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మీ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే గణపతి స్వామి వారికి ప్రతిరోజు గకారక అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.


మకరం

మకర రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారం లాభ సాటిగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. వివాహ సంబంధాలు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారు ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే గకారక అష్టోత్తరంతో గణపతి స్వామివారికి గరికతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కుంభం

కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రయాణాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. ఖర్చులు అధికంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి గణపతి స్వామివారికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగునేవి బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

మీనం

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున ప్రతి పని నిదానంగా సాగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగ పరుచుకోండి. విదేశాలు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే గరికతో గకారక అష్టోత్తరంతో గణపతి స్వామి వారికి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.




Tags

Next Story