వార ఫలాలు (01-02-2026 నుండి 07-02-2026 వరకు)

Weekly Rasi phalalu
మేష రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి సాధిస్తారు. ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. గడిచినా రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. నిరుద్యోగులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 2 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఒకచోట స్థిరాస్తులు అమ్మి మరొకచోట కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెడతారు. హెల్త్ కార్డు విషయంలో పర్సనల్ లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పు ఇస్తే తిరిగి రాదు. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన సంబంధమైన విషయాలు వివాహ సంబంధమైన విషయాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధున రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చిన ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన వస్తు, వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగ మారకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి అంతా అనుకూలంగా లేదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే లోహపు వస్తువులపై పెట్టండి మంచి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గడిచిన రెండు మూడు వారాల కంటే ఈవారం బాగుంటుందని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు లాబిస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాలలో సంత నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో సహా ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది సాగుతాయి. కొన్ని కొన్ని విషయాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ప్రతి విషయం మనసుకు తీసుకోవడం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సొంత ఇంటి కల ఈ వారం నెరవేరుతుంది. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రెడిట్ కార్డు కి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన విషయం. సంతానం యొక్క వివాహం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానంలో ఒకరికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. స్థిరాస్తులు ఏర్పరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. మీ మాటలకు వక్రభాషలు చెప్పేవారు ఎక్కువ అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీకున్న తెలివితేటలతో ఏదైనా సాధించగలము అనే భావన కలుగుతుంది. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసివచ్చే రంగు కాషాయం. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తులా రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. అన్ని వైపుల మంచి జరుగుతుంది. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ఆహార నియమాలు పాటించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 2 కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ధనాధాయం పెరుగుతుంది. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన సంబంధమైన విషయాలు విదేశాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. శనికి తైలాభిషేకం చేయించడం అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ఇంత కష్టపడినప్పటికీ ఫలితం ఇంతేనా అనే భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఖడ్గమాల స్తోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభ రాశి వారికి వారం అదృష్ట ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలావరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. గతవారం కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. స్థిరాస్లకు సంబంధించిన విష వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇతరులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుండి అవార్డులు రివార్డులు పొందుతారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా ప్రయత్నం చేయండి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుర్వ్యసనాలకు చెడు సహవాసాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి కాలభైరవ రూపు మెడలో ధరించండి కరంగాలి మాల కూడా ధరించడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రేమ వివాహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
Tags
-
Home
-
Menu
