వార ఫలాలు (20-09-2026 నుంచి 26-09-2026 వరకు)

మేషం
మేష రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వివాహాది శుభకార్యాలలో రాజీ పడకుండా ఘనంగా నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా మద్యస్థ ఫలితాలే గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. చిన్నచిన్న విభేదాలు తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. బుధవారం రోజున వినాయకుడికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి అలాగే ఈ రాశి వారికి శని అనుకూలంగా లేడు కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించినట్లయితే సానుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. లేకపోతే కొంత ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బంధు వర్గంతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం యొక్క విద్యా విషయాలకు ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. వ్యాపారపరంగా నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటే వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. శుక్రవారం మరియు మంగళవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిధునం
మిధున రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంది వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా మంచి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు టెండర్లు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం మీరు చేసే ప్రతి పనిలో లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధనప్రాప్తి కలుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగం మారకుండా చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. ఈవారం ద్వితీయార్థంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో జిల్లేడు వత్తులు కలిపి దీపారాధన చేయండి. మంగళవారం మరియు శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా అధికారుల అండదండలు లభిస్తాయి. హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్ రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారంలో ఉన్నవారికి కాలమనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు. నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు మీరు సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ వత్తులతో జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం
సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ లభించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పైవారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సొంతంగా వ్యాపారం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. లాభానికి తగినట్టుగానే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. దీనివలన అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఈ రాశి వారికి కలిసే వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మద్యస్థంగా ఉండే అవకాశం ఉంది. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన లాభం పొందుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంగళవారం మరియు శుక్రవారం రోజున అరటి నార వత్తులతో దీపారాధన చేయడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఎంతోకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నవారికి ఈ వారం మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. వృత్తి వ్యాపారాలపరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు. కుటుంబ పరంగా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. సంతానం యొక్క విద్యా విషయాలలో ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దాసవాడు పది రోజులు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు, కాషాయం ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ మీరు మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలను చక్కదిద్దడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే అవకాశం ఉంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. అర్ధాష్టమ శని నడుస్తుంది కావున శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పాశుపత హోమం కూడా చేయించండి. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. వివాహ సంబంధ మైన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విలాసాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఋణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగాలలో ఏర్పడిన సమస్యల నుండి బయట పడగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంది. ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రం చదవండి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం లేదా శనివారం రోజున వడమాల సమర్పించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ధన నష్టం కలిగి అవకాశం ఉంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. బంధు వర్గంతో చిన్నపాటి విభేదాలు మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు మరియు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగునే నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
మీనం
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార బలంగా కూడా లాభసాటిగా ఉంటుంది. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. నిరాశ వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
Tags
-
Home
-
Menu
