వార ఫలాలు (28-09-2025 నుండి 04-10-2025 వరకు)

వార ఫలాలు (28-09-2025 నుండి 04-10-2025 వరకు)
X

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా ఆటుపోట్లు ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం అనేది మీ మనోవేదనకు కారణం అవుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి నిరాశే మిగులుతుంది. నిరాశ స్పృహతో కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. నూతన గృహం కొనుగోలుకై బ్యాంకు లోను మంజూరు అవుతుంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ నవరాత్రులలో అమ్మవారికి కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో పూజ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు బ్లూ.

వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగి పోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీకున్న తెలివితేటలతో అందరినీ మెప్పించ గలుగుతారు. కెరియర్ పరంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగం మారకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్నేహితులకు దూరంగా ఉండండి. విదేశాలలో ఉన్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. హెచ్ వన్ బి వీసా కు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే కూడా సొంతంగా చేసే వ్యాపారాలలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది.జీవితభాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సినీ కళారంగాలలో ఉన్న వారికి నూతన అవకాశాలు బాగున్నాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి అలాగే కాలభైరవ రూపు మెడలో ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 2 కలిసివచ్చే రంగు తెలుపు.

మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొన్నివిషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గడిచిన మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు వైద్య వృత్తికి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. కష్టపడకుండా ప్రతి ఫలాన్ని ఆశించరు. ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. క్రెడిట్ కార్డుల విషయంలో పర్సనల్ లోన్ల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కోర్టుపరమైన విషయాలు స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగు తుంది.నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. విదేశాలలో ఉన్న కొంతమందికి పిఆర్ లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో జీవితభాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఆపాత్ర దానం చేయకండి. ఈ నవరాత్రులలో అమ్మవారిని కుబేర కుంకుమ ఆరావళి కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరున్.

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి.ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించండి. ఈ నవరాత్రులలో చండీ హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరావళి కుంకుమతో పూజించండి. లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు ఎల్లో.

కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్నిపనులు పూర్తి చేస్తారు. కెరియర్ పరంగా బాగుంటుంది. వృత్తి-వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. నవరాత్రులలో చండీ హోమం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. సోదరులతో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి లేకపోతే అనారోగ్యానికి గురవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిని కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే.

తులా రాశి వారికి ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో ఉంటాయి. నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది . ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. ఈ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పక పోవచ్చు. నవరాత్రులలో అమ్మవారిని ఆరావళి కుంకుమతో పూజ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. చర్మ సమస్యలు అజీర్తికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వస్తారు. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారికి స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. మీ చిరకాల కోరిక నెరవేరింది అనే భావన కలుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థిని విద్యార్థులు చదువు పైన శ్రద్ధ వహించాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ విద్య కలిసి వస్తుంది. ఈ నవరాత్రులలో ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మ వారికి పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మూలా నక్షత్రం రోజున ఏదైనా గుడిలో చండీ హోమం జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎరుపు.

ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ చేతి వరకు వచ్చి పెండింగ్లో ఉండటం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ప్రయాసతో కాని పూర్తి కావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేసిన పనినే చేయవలసి వస్తుంది. కొంత మానసికమైన ఒత్తిడికి గురవుతారు. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కాబట్టి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కెరియర్ పరంగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. నవరాత్రులలో అమ్మవారిని ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్ళండి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. సినిమా రంగంలో ఉన్న వారికి కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. మీపై దుష్ప్రచారం చేసేవారు ఎక్కువగా ఉంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, స్టీల్ వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు ఈవారం లాభాలు బాగుంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. నవరాత్రులలో అమ్మవారిని ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో పూజించండి అలాగే మూలా నక్షత్రం రోజున చండీ హోమం జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా నాలుగు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఊహలోకాలకు దూరంగా ఉండండి. ప్రాక్టికల్ కి దగ్గరగా ఉండండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యములు నిర్వహిస్తారు . ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేస్తారు. సాధ్యమైనంతవరకు పొదుపు పైన దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో సఖ్యత లోపించే అవకాశం ఉంది. నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున ఏదైనా గుడిలో చండీ హోమం జరిపించండి అలాగే ఆరవలి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలలో మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎక్కువగా ఆలోచన చేయడం వలన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో పూజించండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. భాగస్వామ్య వ్యాపారాలలో నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. చాలాకాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్.

Tags

Next Story