వార ఫలాలు (07-12-2025 నుండి 13-12-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగుతుంది. ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది లాభాలు తక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాల వలన శ్రమ అధికమవుతుంది. రావలసిన ధనం అని చేతికి అందకపోవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. మీరు నూతనంగా ప్రారంభించిన వ్యాపారం లాభాల బాటలో ఉంటుంది. బంధువులతో ఆ కారణంగా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహా రాలను ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారి లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్.
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ గాని ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. కెరియర్ పరంగా ఉన్నత స్థానానికి వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కీలకమైన విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం మీకు దక్కుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సినీ కళా రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రేమ సంబంధమైన విషయ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్లూ.
మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కష్టాన్ని ఎవరు గుర్తించరు. ఒక రకంగా చెప్పాలంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. భయానాలలో నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా కొంతవరకు పురోగతి సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కొంత సమయం తీసుకుని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వాహనం కొనుగోలు వాయిదా పడుతుంది. నిరాశలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మృతి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే.
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. అత్యవసరమైతేనే దూర ప్రాంత ప్రయాణాలు చేయండి. వృత్తి ఉద్యోగాలపరంగా సాధారణంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు లాభసాధిగా సాగుతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. పంచముఖి హనుమాన్ లాకెట్ ను మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు.
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా కలుసుబాటు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి లాభాలు బాగానే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. తల్లి గారి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కొన్ని విషయాలలో మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసిక వేదనకు కారణం అవుతాయి. ఆర్థికపరమైన విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్వగృహ నిర్మాణం చేపడతారు. ధనం సర్దుబాటు అవుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి శని గ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసే వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. గుత్తి ఉద్యోగాలపరంగా అనుకూలత సాధించగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. స్థిరాస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఒకసారి వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్.
తులా రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. నడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. నూతన రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఖర్చులను నియంత్రిస్తారు. మీ రాశి వారు అంగారక పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
వృశ్చిక రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. సుత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. నరదిష్టి అధికంగా ఉంటుంది. కెరియర్ పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పొదుపు పైన దృష్టి పెడతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందిస్తుంది. కాంట్రాక్టులు లీజులు రెన్యువల్స్ లభిస్తాయి. సహోదరీ సహోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. వ్యాపార పరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు.
ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రతి పనిని ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీ బస్సులలో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఆర్థిక భారం తగ్గుతుంది. వివాహాది ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈవారం చాలా బాగుందని చెప్పవచ్చు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు చేతి వరకు వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గౌరవిస్తారు. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. నలుగురిలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేతి వరకు వచ్చిన ధనం చేజారిపోతుంది. మీరు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. వ్యాపారంలో నూతన భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. వారాంతంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. అప్పుచేసి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. మీరు సొంతంగా చేసుకున్న వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ సూత్రాన్ని చదవండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. పది రోజు కూడా నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీసా పాస్పోర్టు లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ లభిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు విహారయాత్రలు చేస్తారు. కుటుంబ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. సాధ్యమైనంతవరకు పొదుగుపైన దృష్టి పెడతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నీ జీవిత ఆశయం నెరవేరుతుంది అనే భావన కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రాణి సాధ్యమైనంత వరకు పొదుపు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపార విస్తరణ చేస్తారు నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఉద్యోగపరంగా ఊహించని స్థానచలన సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.
Tags
-
Home
-
Menu
