స్కాట్‌ల్యాండ్ ఆలౌట్.. విండీస్ ఘన విజయం

X
కోల్‌కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్‌లాండ్ విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. ముఖ్యంగా రొమారియో షెపర్డ్ హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి.. వెస్టిండీస్ విజయానికి బాటలు వేశాడు. స్కాట్‌లాండ్ బ్యాటింగ్‌లో బెర్రింగ్‌టన్ (42), బ్రూస్ (35) జట్టును గెలిపించేందుకు కృషి చేశారు. కానీ, మిగితా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దీంతో స్కాట్‌లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగుల చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Next Story
-
Home
-
Menu
