సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు.. అసలు ఆయన ఎవరు?: జీవన్ రెడ్డి

జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కలిసి పనిచేయాలని తనకు ఆయన ఆఫర్ ఇచ్చారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. మంగళవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనని ఎలా కలిసి రమ్మంటారని చురకలంటించారు. సంజయ్ బిఆర్ఎస్‌లో ఉన్నారని స్పీకర్ అంటున్నారని, కాంగ్రెస్‌లో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారని, తనకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు? అని నిలదీశారు. తాను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా? పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు? అని మండిపడ్డారు. పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా? అని దుయ్యబట్టారు. మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఇంకా ఎంత కాలం బరించాలని జీవన్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి అవమానాలు బరించలేక పార్టీ మారుతానని చెప్పిన విషయం విధితమే.
Tags
-
Home
-
Menu
