మండిపోతున్న నిత్యావసరాలు.. 9.92% కి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం!

హైదరాబాద్: దేశంలో వస్తువుల ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. జులైలో 9.78%గా ఉన్న హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 9.92%కి చేరింది. ఏం పెరిగింది? 👇
ఆహార ద్రవ్యోల్బణం: 6.65% → 7.05%
తయారీ ఉత్పత్తులు: 8.29% → 8.37%
ఇంధనం, విద్యుత్: ఏకంగా 22.93%
ముడిచమురు, ఆహార దినుసులు, ప్రాథమిక లోహాలు, రసాయనాల ధరల పెరుగుదల డబ్ల్యుపిఐపై ఒత్తిడి పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద సరఫరా సమస్యలు ముడిచమురు, ఎరువుల ధరలను మరింత ప్రభావితం చేస్తున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయ వ్యయాలు పెరుగుతాయి. చివరికి ఆ ప్రభావం ఆహార ధరలపైనా పడే అవకాశం ఉంది. అయితే ఆర్ బిఐ ఎఫ్ వై 27 రిటైల్ ద్రవ్యోల్బణం 5% వద్ద ఉండొచ్చని అంచనా వేస్తోంది. హోల్‌సేల్ ధరల పెరుగుదల సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై ఎంత ప్రభావం చూపుతుంది? రాబోయే నెలలు కీలకంగా మారుతాయి.
-
Home
-
Menu
