భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
X

సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం పోలీస్ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న, పద్మ దంపతులు.దంపతుల మధ్య కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం నెలకొని వెంకన్న భార్య(40)ను రోకలిబండతో తలపై కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజయ్ కుమార్ తెలిపారు.

Tags

Next Story