మహిళతో వివాహేతర సంబంధం... భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

వేరే మహిళతో వివాహేతర సంబంధం
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మన తెలంగాణ /సిద్దిపేట రూరల్: వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేసిన సంఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన బాల్ లక్ష్మి అనే మహిళ తన భర్త భూంరాజు ఇంటి ముందు పిల్లలతో కలిసి శనివారం నిరసనకు దిగింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను, తన పిల్లలను బాధింపజేసి చివరికి ఇంటి బయటకు నెట్టేశాడని ఆమె ఆరోపించింది. 2005లో పెద్దల సమక్షంలో భూంరాజుతో తన వివాహం జరిగింది. ప్రస్తుతం 18 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా భూంరాజు తమ ఇంటి సమీపంలోని మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తూ, తనపై తరచూ దాడులకు పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. పలుమార్లు పెద్దల సమక్షంలో జరిగిన సమావేశాల్లో భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ బాల్ లక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్‌లో భూంరాజుపై అధికారిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
-
Home
-
Menu
