కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తాం: పొంగులేటి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తాం: పొంగులేటి
X

హైదరాబాద్: భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వమిది అని అన్నారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.

Tags

Next Story