వ్యవసాయ బావిలో దూకి చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, రేండ్లగూడలో మతిస్థిమితం లేక వ్యవసాయ బావిలో తల్లి తన కూతురు (9 నెలలు)తో సహా శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం చెట్పల్లి గంగయ్య, లక్ష్మిల చిన్న కుమారుడు శ్రీనివాస్‌కు జగిత్యాల జిల్లా, సారంగపూర్‌కు చెందిన సుగంధతో వివాహమైంది. ప్రస్తుతం శ్రీనివాస్ గుడిపేట బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన తర్వాత మూడేళ్ల వరకు కలసిమెలసి సంతోషంగా ఉండేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మోక్ష, వేదశ్రీ. , చిన్న కూతురు వేదశ్రీ జన్మించినప్పటి నుండి సుగంధ ఏదో ఆలోచనల విధానంతో మానసిక స్థితికి లోనైంది. తాను చనిపోతాను అంటుండేది. దీంతో ఆమె అత్తమామలు ఆమెను నిత్యం గమనిస్తూ ఉండేవారు. శుక్రవారం ఉదయం సుగంధ తన చిన్న కూతురు వేదశ్రీ (9 నెలలు)కి భోజనం చేయిస్తానని బయటకు వెళ్లి..
తమ ఇంటికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో కూతురుతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది.సుగుంధ కోసం అత్తమామలు వెతకగా వ్యవసాయ బావిలో కోడలు, మనుమరాలు కనిపించడంతో చుట్టుపక్కల వారిని పిలిచి బావిలో నుండి మృతదేహాలను బయటకు తీశారు. ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, తన భార్య చిన్నకుమార్తెతో సహా బావిలో దైకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి వచ్చిన శ్రీనివాస్ వారి మృతదేహాలను చూసి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. సంఘటన స్థలాన్ని లక్షటిపేట సిఐ రమణమూర్తి, ఎస్‌ఐ గొల్ల అనూష, తహసిల్దార్ రాజమనోహార్‌రెడ్డి సందర్శించారు. సంఘటనపై మృతురాలి తల్లి బూదరి ఈశ్వరి, సుగంధ ఆత్మహత్య విషయంలో ఎవరి ప్రమేయం లేదని ఫిర్యాడు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జన్నారం ఎస్‌ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
-
Home
-
Menu
