మహిళ దారుణ హత్య

మహిళ దారుణ హత్య
X

ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు నర్సింహులు కూతురు మంతూర్ కల్పన ( 26 )కు ఆరు సంవత్సరాల క్రితం కన్యారం గ్రామానికి చెందిన గణేష్‌తో వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం భర్త తో జరిగిన గొడవ వల్ల పుట్టింటిలో ఉంటుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వెళుతున్నట్లుగా చెప్పి ఇస్లాంపూర్ నుంచి బయలుదేరి వెళ్ళింది. మరుసటి రోజు బుధవారం అర్ధ రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడకు వైర్‌తో బిగించి హత్య చేసి నాచారం గ్రామ శివారులో పడేశారు. మృతురాలి తండ్రి జోడు నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు.

Tags

Next Story