‘శ్రీ చక్ర’ హాస్పిటల్‌లో దారుణం

హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జ్వరంతో ఐలావోని మండలం, గార్లపల్లి గ్రామానికి చెందిన కల్పన (40) ఆర్‌ఎంపి డాక్టర్ ని సంప్రదించగా హన్మకొండ శ్రీ చక్ర హాస్పిటల్‌కి రెఫర్ చేయడంతో ఆమె అడ్మిట్ అయింది. డాక్టర్ వెంటనే పరీక్షలు నిర్వహించాలని, దానికి సంబంధించిన డబ్బులు కట్టాలని చెప్పగా వెంటనే ఆ మహిళ కూతురు, భర్త కలిసి రూ.20 వేలు చెల్లించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటూ డబ్బులు కట్టమని అడగగా వారి వద్ద ఉన్న మరో రూ.20 వేలు కట్టారు. ఒకరోజు గడిచిన తర్వాత మళ్ళీ ఇంకా డబ్బులు కావాలి.. లక్ష రూపాయల వరకు అవుతుంది..
డయాలసిస్ చేయాలని డాక్టర్ చెప్పగా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని, రేపు ఉదయానికల్లా సర్దుబాటు చేసి కడతామని చెప్పగా డాక్టర్, సిబ్బంది వినకుండా పేషంటు భర్తను, వారి కుమార్తెను భయభ్రాంతులకు గురిచేశారు. డబ్బులు కట్టకుంటే వైద్యం చేయమంటూ పెట్టిన వెంటిలేషన్‌ను తీసివేయగా పేషంటు ప్రాణాలు పోయాయి. డబ్బులు కట్టకుంటే పేషెంట్ ప్రాణాలు తీస్తారా అంటూ మృతురాలి భర్త, వారి కుమార్తె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేషంట్ బంధువులకు సమాచారం ఇవ్వగా బంధువులంతా హాస్పిటల్ చేరుకొని నిరసన తెలిపారు.
-
Home
-
Menu
