మరిగే సాంబారులో పడి మహిళ మృతి

X
మరిగే సాంబారులో పడి మహిళ మృతి చెందిన సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన అన్నదాన కార్యక్రమంలో వంట ఏర్పాట్లు చేస్తుండగా సుజాత (46) అనే మహిళ ప్రమాదవశాత్తూ మరిగే సాంబారు పాత్రలో పడిపోయారు. పాత్రను కింద పెడుతుండగా తూలి అందులో పడిపోయింది.అక్కడ ఉన్నవారు వెంటనే ఆమెను బయటకు తీసి తీవ్రమైన కాలిన గాయాలతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Tags
Next Story
-
Home
-
Menu
