అన్నదానం... సాంబారులో పడి మహిళ మృతి

X
Woman dies after falling into sambar
విజయవాడ: అన్నదానం కార్యక్రమం చేస్తుండగా సాంబారులో మహిళ పడి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... కెఎల్ రావునగర్‌లో మద్ది సుజాత(46) తన చిన్న కుమారుడుతో కలిసి ఉంటుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుజాత వంటలు చేస్తుండగా తూలి సాంబారులో పడింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ముఖంతో పాటు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు.
Tags
Next Story
-
Home
-
Menu
