గ్రూప్ ఫోటో దిగుతూ మృత్యు ఒడిలోకి

ఖమ్మం నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఒక మహిళ బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతుండగా ఒకేసారి గుండెపోటుకు గురై అక్కడికక్కడే కూప్పకూలిన సంఘటన పుట్టకోటలో చోటుచేసుకుంది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత (43) అనే మహిళ ఖమ్మం నగరంలోని పుట్టకోట ప్రాంతంలో గల తన బంధువుల ఇంట్లో సోమవారం ఉదయం జరిగిన గ్రహ ప్రవేశం శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా బంధువులతో కలిసి
గ్రూఫ్ ఫొటో దిగుతుండగా అకస్మాత్తుగా సుస్మిత కుప్పకూలింది. అప్రమత్తమైన బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండాపోయింది.గుండెపోటుకు గురైన సుస్మిత అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు .అప్పటి వరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఫోటో దిగుతు విగత జీవిగా మారిన సుస్మిత ప్రేమ వివాహం చేసుకుంది.ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త వ్యాపారం నిర్వహిస్తుంటగా ఆమె తండ్రి పత్రికయాడ్ ఏజెన్సీ నిర్వహించేవారు.
-
Home
-
Menu
