యాదగిరిగుట్ట కొండ పై మహిళ దుర్మరణం

Woman dies on Yadagirigutta hill
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రమైన యాదగిరిగుట్ట కొండపై మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కొండపై భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంమేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని యాదగిరిగుట్టకు చెందిన ఈశ్వరమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.కొండపై మహిళ మృతి చెందడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ ద్వారాలను మూసివేసి భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో దర్శనాల కోసం వచ్చిన భక్తులకు కొంతసేపు అసౌకర్యం ఏర్పడింది. శుద్ధి, సంప్రోక్షణ అనంతరం దర్శనాలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
-
Home
-
Menu
