అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

X
ధర్పల్లీ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ వ్యక్తి మహిళా మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా, అది ఒక్కసారిగా కింద పడిపోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా.. మృతురాలు సీతాయిపేటకు చెందిన జారుపుల కాంతిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు . మృతదేహాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె ఎలా మృతి చెందింది? మృతదేహాన్ని బైక్‌పై ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు.
Next Story
-
Home
-
Menu
