అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
X

బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి గర్బిణీని తీసుకొని వస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్‌లో మహిళ ప్రసవించినట్లు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఈఎంటీ లక్ష్మణ్ తెలిపారు. వివరాలలోకి వెళితే.. లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన శైలజకు డెలివరీ కోసం మాత శిశు సంరక్షణ ఆస్పత్రి బాన్సువాడకు తీసుకుని వస్తుండగా తగిన పరీక్షలని నిర్వహించారు. ఈ క్రమంలో మహిళకు బిపి పెరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాన్సువాడ నుంచి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్‌లో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ లక్ష్మణ్ డెలివరీ చేశాడు. ఆడ బిడ్డకు జన్మనివ్వగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు ఈఎంటీ లక్ష్మణ్‌తో పాటు పైలట్ రాముకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి చికిత్స కోసం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగింది.

Tags

Next Story