హైదరాబాద్ లో మరో దారుణం.. యువతి గొంతు కోసి చంపిన యువకుడు

హైదరాబాద్ సిటీలో మారో దారుణం జరిగింది. ఓ యువకుడు.. 18ఏళ్ల యువతి గొంతు కోసి పరారయ్యాడు. ఈ విషాద సంఘటన నగరంలోని వారసిగూడలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ మధ్యాహ్నం వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో ఉంటున్న పవిత్రను ఇంట్లోకి చొరబడి ఉమాశంకర్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. వరుసగా బావ అయిన ఉమాశంకర్ పవిత్ర పెళ్లి చేసుకోవాలనుకున్నాడని.. కానీ, అతడు మద్యానికి బానిసై తాగుబోతు కావడంతో పవిత్ర పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువతిపై కక్ష పెంచుకున్న ఉమాశంకర్.. ఈ దారుణానికి పాల్పడినట్లు యువతి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
-
Home
-
Menu
