విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి

విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
X

జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, మారేడుపల్లి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బింగి సతీష్ తండ్రి చిన్నయ్య 35 రోజూవారీ కార్యక్రమ వ్యవసాయ పనుల్లో భాగంగా వంటచేనుకు మందు పిచికారి చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పక్కన గల పంటచేలో అమర్చిన విద్యుత్ తీగ షాక్ తగలడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story