సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్య
X

తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామంలోని స్మశాన వాటిక వద్ద సోమవారం రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి(29) అనే యువకుడు తన చావుకు కుటుంబ సభ్యులే కారణమంటూ కంటతడి పెట్టించి సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్య. చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి కి రెండు నెలల క్రితమే మనీషా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులు అయిన అన్నదమ్ములతో కలిసి చిన్న ముల్కనూర్ గ్రామంలో లక్షల పెట్టుబడి పెట్టి మహాదేవ్ సూపర్ మార్కెట్ ను నడిపిస్తున్నారు. సూపర్ మార్కెట్ ఆర్థిక లావాదేవీలలో తన తోడ బుట్టిన అన్నదమ్ములే మోసం చేయడం,తన తల్లిదండ్రులు,అన్నదమ్ములు తనను తన భార్యను అవమానపరిచి,ఆర్థికంగా దెబ్బతీసి వెలివేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి నేను చనిపోయిన తనను నమ్ముకున్న భార్యకు న్యాయం చేయాలని వేడు కుంటూ సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హృదయ విధాకరమైన ఘటన కంట తడి పెట్టించింది.

నా మరణానికి నా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములే కారణమని, నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్యకు న్యాయం చేయని బ్రతుకు నాకు ఎందుకు అని భావించి, నేను పురుగుల మందు త్రాగి చచ్చిపోతున్నా, నీవు మంచిగా బ్రతకమని భార్యను ఓదారుస్తూ, నా భార్య అమాయకురాలు అని వేడుకొంటూ..నేను చనిపోయిన తదనంతరము భార్యకు నా కుటుంబ సభ్యుల నుండి కనీసం 10 లక్షల రూపాయలు ఇప్పించాలని ఎస్‌ఐకి వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి,చనిపోతున్నా అని తన భార్యకు తెలియజేసి,పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే భార్య తన తోటి స్నేహి తులు ఘటన స్థలానికి వెళ్లి చూసే సరికి నాగేల్లి వెంకటేష్ రెడ్డి అపస్మారక స్థితిలో కింద పడి ఉండగా, వెంటనే కరీంనగర్ లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళ వారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న ట్టు ఎల్‌ఎండి ఎస్‌ఐ తెలిపారు.

Tags

Next Story