చైనా మాంజాతో గొంతు తెగి యువకుడి మృతి

సంక్రాంతి పండగ రోజు చైనా మాంజా తెగి యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఫసల్‌వాదీలో చోటుచేసుకుంది. బతుకు దెరువు కోసం సంగారెడ్డి ప్రాంతానికి వచ్చి పనిచేసుకుంటూ జీవిస్తున్న యువకుడు చైనా మాంజా తగిలి గొతు కోసుకుపోయి మృత్యువాత పడటం కుటుంబ సభ్యలతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవదేష్‌కుమార్ (38) ఫసల్‌వాదీలో గ్రాంలో పొలంలో కూలీ పనుల కోసం వచ్చి వరి నాట్లు వేసి కూరగాయల కోసం సంగారెడ్డికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా గాలిపటాలు ఎగురవేసే దారం ఎడకు తగిలి తీవ్ర రక్త స్రావం కాగా స్థానికులు పోలీసులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయాడని తెలిపారు. మృతుడి కుమారుడు భాను ప్రతాప్ భాస్కర్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని చైనా మాంజాను స్వాధీనం చేసుకొని మృతదేహాన్నీ పోస్టుమార్టం కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి పండగనాడు చైనా మాంజాతో యువకుడు మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నెలకొంది.
-
Home
-
Menu
