ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువకుడి ఇల్లు ధ్వంసం... ఏడుగురు అరెస్టు

గద్వాల: ప్రేమించి వివాహం చేసుకున్నాడనే కోపంతో యువకుడి ఇంటిని ప్రియురాలు కుటుంబ సభ్యులు ధ్వంసం చేయడంతో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డిఎస్ పి మొగిలయ్య తెలిపారు. గద్వాల మండలం రేపల్లి గ్రామమానికి చెందిన ఓ యువతి, యువకుడు ఈ నెల 10న ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అతడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో టీ. వీరన్న, పరశురాములు అలియాస్ పరుష, వెంకటేష్ అలియాస్ టీ. వెంకటేష్ నాయుడు, పరశురాములు, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్నఅలియాస్ తిమ్మప్పలను శనివారం సాయంత్రం అరెస్టు చేశామని డిఎస్ పి పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వివరించారు. అనంతరం నిందితులను అలంపూర్ జెఎఫ్‌సిఎం కోర్టులో హాజరుపరచామని, న్యాయమూర్తి న్యాయ రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దళిత యువకుడుని ప్రేమించి పెళ్లి చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు పెళ్ళికొడుకు ఇల్లును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
Tags
-
Home
-
Menu
