నా చావుకు ఆ ఇద్దరే కారణం... మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Young men harassment Female constable
X

Young men harassment Female constable

వరంగల్: వేధింపులు తట్టుకోలేక ఇద్దరు యువకుల మధ్య నలిగి ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత ఎఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. వరంగల్ కమిసనరేట్‌లో ఆమె విధులు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లికి చెందిన రాజేందర్ దూరపు బంధువు కావడంతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు బంధువులు కావడంతో పెళ్లి చేసుకుంటానని ఆమెను అతడు అడగడంతో ఓకే చెప్పింది. గత కొంత కాలంగా ఆమెను అతడు వేధింపులకు గురి చేస్తున్నాడు. మరొకరితో మాట్లాడుతున్నాడని అంటూ తరచు వేధించడంతో భరించలేక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు రాజేందర్ కుటుంబ సభ్యులకు పెళ్లి చేయమని తెగేసి చెప్పారు. దీంతో రాజేందర్ ఆమెపై పగ పెంచుకున్నాడు. అనిత తన క్లాస్‌మెట్ జబ్బార్‌తో చనువుగా ఉండడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం రాజేందర్‌కు తెలియడంతో వెంటనే జబ్బార్‌కు ఫోన్ చేసి అనిత గురించి చెడుగా చెప్పాడు. జబ్బార్ కూడా మహిళా కానిస్టేబుల్ వేధించడం మొదలు పెట్టాడు. జబ్బార్ కూడా ఆమెను వేధించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని పలుమార్లు కానిస్టేబుల్‌ను బెదిరించాడు. ఈ క్రమంలో రాజేందర్‌కు అనిత ఫోన్ చేసి ఇద్దరితో తన జీవితం నాశనమైందని మండిపడింది. ఇద్దరి వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. వెంటనే గడ్డిమందు తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. అనిత తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు జబ్బార్‌తో రాజేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story