యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడి హత్య

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడి హత్య
X

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు నిజామాబాద్‌ నగరంలోని రెండో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. ఉషా ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అనంతరం కారులోనే అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. హత్యకు గురైన వ్యక్తి హరిబాబు గా పోలీసులు గుర్తించారు. ఇటీవల కోరుట్ల లో జరిగిన యూట్యూబర్ వైష్ణవి ని హత్య కేసులో హరిబాబు నిందితుడిగా ఉన్నారు. ఆయన ఇటీవలే బెయిల్ మీద జైలు నుంచి బయటికి వచ్చి నిజామాబాద్ నగరంలో ఉంటున్నాడు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Tags

Next Story