అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు మృతి

X
మన తెలంగాణ/రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిట్టల నర్సయ్య (62) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నర్సయ్య అప్పుల బాధతో మనస్థాపానికి గురై బుధవారం మధ్యాహ్నం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంగనర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
Next Story
-
Home
-
Menu
