శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ..

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హజీపూర్ సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి చికిత్స కోసం యెన్నం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్టీసి బస్సును కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో పెను విషాదం చెటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
-
Home
-
Menu
