భూ భారతి.... ఆపరేటర్ల..ఆకలి కేకలు?

ఆపరేటర్ల తొలగింపునకు రంగం సిద్ధం
వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్ల నియామకం
కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ కొనసాగింపు
ఆందోళనలో అవుట్సోర్సింగ్ ఆపరేటర్లు
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం తహశీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి త్వరలోనే వారిని తొలగించే ప్రక్రియ మొదలైంది. వారి స్థానంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్న ఉ ద్యోగులకు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.దీంతో ప్రస్తుతం పని చేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది. భూభారతి ఆపరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రభుత్వానికి విన్నపాలు మొరపెట్టుకుంది. మా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. వయసు భారం పెరిగిపోయింది ఇతర ఉద్యోగాల్లో పనిచేయడానికి అర్హత కోల్పోయాం వీటిని నమ్ముకొని ఔట్సోర్సింగ్ నియమాకం తో కొనసాగుతున్న మా బతుకులు ఆగమవుతున్నాయని ఆకలి కేకలతో ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. భూభారతిలో కాకుండా ఇతర శాఖలోనైనా సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నట్లు ఆపరేటర్ల సంఘం నాయకులు అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది
గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి తహశీల్దార్ కార్యాలయంలో భూముల రి జిస్ట్రేషన్ చేయాలని 2018 లో నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవాల ని నిర్ణయించారు. సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లును చేర్చుకోగా వీరిని ప్రతి ఏటా మార్చ్ ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసేవారు. ముందుగా 11 వేల.వేతనం ఇవ్వగా ఆ తర్వాత 13వేల వేతనం పెంచారు. ఆ త ర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లకు టీజీటీఎస్ కింద తీసుకొని నెలకు 21500 వే తనం ఇస్తున్నారు. ఈ వేతనం నెలవారీగా ఇవ్వకుండా మూడు ఆరు నెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు అయినా నేటికీ 15 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నట్లు ఆపరేటర్లు అంటున్నారు..
మా కుటుంబాలు వీధిన పడుతున్నాయి అన్యాయం చెయ్యొద్దు
రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ఆపరేటర్లు ఔట్సోర్సింగ్ పద్ధతిన తహశీల్దార్ కార్యాలయంలో విధులు కొనసాగిస్తున్నాం. మమ్ములను ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. మేము ఏ శాఖలో పని చేయాలన్నా మా వయసు మీరీ పోయింది. భూభారతినీ. నమ్ముకొని ఆధారపడి విధులు కొనసాగిస్తున్నాము.
ఉద్యోగం ఊడిపోతే మా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుందని ఆపరేటర్లు అంటున్నారు. భూభారతి ఆపరేటర్లును ఇతర శాఖలోనైనా స ర్దుబాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. 7 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు మా ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్యాయంగా తొలగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొదట 300 మంది తొలగిస్తామని చెప్పి ఇప్పుడు అందరిని తొలగించే కుట్ర అంతర్గతంగా కొనసాగుతుందని ఆపరేటర్లు అంటున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Tags
-
Home
-
Menu
